పిల్లల కేరింతలు, చిరునవ్వులతో ఇంట్లో ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-11-17T23:42:30+05:30 IST

పిల్లల కేరింతలు, చిరునవ్వులతో ఏ ఇల్లు ప్రతిధ్వనులతో నిండి ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందని రిటైర్డ్‌ తెలుగు పండిట్‌ తుట్టగుంట భైరవమూర్తి అన్నారు.

పిల్లల కేరింతలు, చిరునవ్వులతో ఇంట్లో ఆరోగ్యం

కొవ్వూరు, నవంబరు 17: పిల్లల కేరింతలు, చిరునవ్వులతో ఏ ఇల్లు ప్రతిధ్వనులతో నిండి ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుందని రిటైర్డ్‌ తెలుగు పండిట్‌ తుట్టగుంట భైరవమూర్తి అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగం గా గురువారం కొవ్వూరు ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయంలో కవి సమ్మేళనం, విద్యార్థులకు సంగీతం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనిపెద్ది జగన్నాథశాస్త్రి మాట్లాడుతూ శ్రీశ్రీ, గుర్రం జాషువా వంటి కవులు స్ఫూర్తి ప్రదాతలన్నారు. కవిత్వానికి జాతి, మత, కుల, లింగ వివక్ష లేదన్నారు. కవిత్వం నేర్చుకోవడానికి ప్రతినెలా కొవ్వూరులో వర్క్‌షాపు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో చామర్తి విశ్వనాథశర్మ, రాయప్రోలు కామేశ్వరశర్మ, ఎం.శ్రీలలిత, గోవర్ధనం శ్రీనివాసమూర్తి, గ్రంథాలయాధికారి జీవీవీఎన్‌ త్రినాథ్‌, వివిద పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు డిజిటల్‌ యుగంలో గ్రంథాలయాల ఆవశ్యకతపై వ్యాసరచనా పోటీలు, విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించడంపై పోటీలు నిర్వహించారు.మ, తహశీల్దార్‌ రామకృష్ణ, ఎస్‌ఐ కే శ్రీహరిరావు పాల్గొన్నారు

Updated Date - 2022-11-17T23:42:31+05:30 IST