ప్రజా సంక్షేమ రామరాజ్యం రావాలి

ABN , First Publish Date - 2022-12-31T01:13:22+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన పోవాలి ప్రజా సంక్షేమ రామరాజ్యం రావాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. శుక్రవారం నిడదవోలు మండలం జీడి గుంటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు.

ప్రజా సంక్షేమ రామరాజ్యం రావాలి

నిడదవోలు, డిసెంబరు 30: వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన పోవాలి ప్రజా సంక్షేమ రామరాజ్యం రావాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. శుక్రవారం నిడదవోలు మండలం జీడి గుంటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇం టింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ గ్రామాల నుంచి పట్టణాల వరకు యువత, మహిళలు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అర్హులైన ఎందరికో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందకుండా చేస్తూ నానా ఇబ్బందు లకు గురి చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తుమ్మూరి పెద శేషగిరిరావు తదితర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:13:22+05:30 IST

Read more