ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-16T00:35:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతి, అక్రమాలతో తమ జేబులు నింపుకోవడానికే సమయం వెచ్చిస్తున్నా రని రాబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు విమర్శించారు. టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో గురువారం పలుచోట్ల నిర్వహించారు.

 ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

  • నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు

  • పలుచోట్ల ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

పెరవలి, డిసెంబరు 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతి, అక్రమాలతో తమ జేబులు నింపుకోవడానికే సమయం వెచ్చిస్తున్నా రని రాబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు విమర్శించారు. టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో గురువారం పలుచోట్ల నిర్వహించారు. కానూరులో జరిగిన కార్యక్రమంలో శేషారావు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ నాయకులందరూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మాయ చేస్తున్నారని, ప్రజలు నిజం తెలుసుకున్నా రని త్వరలోనే వారికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పెరిగిన ధరలతో సామాన్యులు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా చేస్తుందని ప్రశ్నించారు. కార్యక్రమంలో అతికాల శ్రీను, భూపతిరాజు రవివర్మ, బొడ్డు రామాంజనేయులు, అబ్బిశెట్టి సత్తిరాజు, వాకలపూడి వీర్రాజు, గొల్లపూడి రాజేంద్ర ప్రసాద్‌, శిరిగినీడి శేషగిరిరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:35:18+05:30 IST