ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-06-07T06:51:23+05:30 IST

ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాపాక వరప్రసా దరావు అన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

మలికిపురం, జూన్‌ 6: ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాపాక వరప్రసా దరావు అన్నారు. మలికిపురం మండల పరిషత్‌ కార్యాల యంలో ఎంపీపీ ఎంవీ సత్యవాణి అధ్యక్షతన జరిగిన మం డల సర్యసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ, వలంటీరు వ్యవస్థల ద్వారా ప్రజలకు అన్ని సేవలు అందిస్తుందన్నారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలన్నారు. రంగరాజన్‌ కమిటీ సిఫార్సుల మేరకే పాఠశాలల విలీన ప్రక్రియ జరుగు తుందన్నారు. ఉపాధి ఫీల్డు అసిస్టెంట్లు  పనులను గుర్తించి అవి పూర్తయ్యేలా ముందుకు వెళ్లాలన్నారు. ఎంపీపీ సత్యవా ణి మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉం డాలన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో ఎంపీడీవో బాబ్జిరాజు, తహశీల్దార్‌ వీవీ నరసింహారావు, నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ పాటి శివ, ఎంపీటీసీ సభ్యులు నల్లి అంజని, సీతామహలక్ష్మి, రాజేష్‌, ప్రమీల, మాణిక్యం, సుజాత, శివజ్యోతి, పద్మావతి, సుబ్బారావు, సర్పంచ్‌లు గెడ్డం రాజ్యలక్ష్మి, ఆరేటి రంగ, కాకర శ్రీను, నల్లి  విజయకుమారి, అధికారులు, సీడీపీవో రమాదేవి, వ్యవసాయాధికారి రాకేష్‌, ఏపీవో శ్రీనివాస్‌, డాక్టర్‌ క్రాంతి కుమార్‌, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Read more