పొట్టి శ్రీరాములు కృషితోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ

ABN , First Publish Date - 2022-12-16T00:29:36+05:30 IST

ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు.

పొట్టి శ్రీరాములు కృషితోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ

పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి

కాకినాడ సిటీ, డిసెంబరు 15: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాల యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండ బాబు పొట్టిశ్రీరాములు చిత్రపటానికి గురువారం పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు కృషివల్లే ఆంధ్ర రాష్ట్ర అవత రణ జరిగిందన్నారు. అలాంటి మహనీయులను స్మరించు కోవడం మన అదృష్టమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాసబాబా, పేరా బత్తుల రాజశేఖర్‌, గదుల సాయిబాబు, కొల్లాబత్తుల అప్పా రావు, జార్జ్‌ చక్రవర్తి, జహరుద్దీన్‌ జిలాని పాల్గొన్నారు.

కార్పొరేషన్‌(కాకినాడ): ది కాకినాడ కోఆప రేటివ్‌ బిల్డింగ్‌ సొసైటీ (కేసీబీఎస్‌)లో గురువారం అమరజీవి పొట్టి శ్రీరాము లు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యారావుపేటలో ని కేసీబీఎస్‌ ప్రధాన కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు రెడ్డి వీరరాజేంద్రకుమార్‌, కార్యదర్శి ముమ్మిడి గోవిందు, డైరెక్టర్లు ముత్తా మధు, ముమ్మిడి వెంకటరమణ, మేనేజర్‌ చీమలకొండ గంగాధరం, ఉద్యోగులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

కాకినాడ ఆర్టీసీ డిపోలో గురువారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంకోసం పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువరాని దన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ ఎంయువీ మనోహర్‌ అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

జగ్గంపేట: జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డ్స్‌ జగ్గంపే టశాఖ బెస్ట్‌ క్లబ్‌ అవార్డు, బెస్ట్‌ ప్రెసిడెంట్‌ అవార్డు, గుడ్‌విల్‌ విజిట్‌ అవార్డులు ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవాసంఘం అధ్యక్షుడు కొత్తకొండబాబు మా ట్లాడుతూ వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ అవార్డులు తీసుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కొత్త వెంకటేశ్వరరావు, మానేపట్టి వీర్రాజు గుప్తా, వెంట్రా ప్రగడ శ్రీరామచంద్రమూర్తి, బొండాడ వెంకట జగన్నాధం, దారా శ్రీనివాస్‌, మానేపల్లి బంగార్రాజు, వెత్స నాగసత్య, బొండా నూ కబాబు, కొత్త శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఫ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంవద్ద మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు అత్తూలూరి నాగేశ్వరరావు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి బి.హరికృష్ణలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

కోటనందూరు: కోటనందూరు మండల పరిషత్‌ కార్యాల యంవద్ద ఎంపీపీ లగుడు శ్రీనివాస్‌, ఎంపీడీవో యస్‌యస్‌. శర్మ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు.

పెద్దాపురం : స్థానిక ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీమంగ తాయారు, వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌. మున్సిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర, ఎంపీడీవో కరక హిమ మహేశ్వరి, జడ్పీటీసీ గవరసాన సూరిబాబు, హౌసింగ్‌ కా ర్పొరేషన్‌ రాజశేఖర్‌, కార్యాలయఏవో శ్రీనివాస్‌, జగన్నాథం పాల్గొన్నారు.

సర్పవరంజంక్షన్‌: రమణయ్యపేట మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఎల్డీవో పి. నారాయణమూర్తి, ఎంపీడీవో జె. శ్రీనివాస్‌లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

పిఠాపురం: తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో వర్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మునిసిపల్‌ కమిషనరు ఎం.రామ్మోహన్‌, ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్వో శ్యామల, ఆర్‌ఐ నవీన్‌, శానిటరీ ఇనస్పెక్టర్‌ బి.తిరుమల తదితరులు పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: మండలంలో పెదశంకర్లపూడి టీడీపీ కార్యాల యంవద్ద గురువారం పొట్టి శ్రీరాముల చిత్రపటానికి టీడీపీ ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూర్నీడి సురేష్‌, జువ్విన తిరుపతిరావు, యాళ్ళ జగదీష్‌, మంతెన శ్రీను, చెలు బోయిన నాగేశ్వరరావు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాములు ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

తుని: అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీరాముల శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళు లర్పించారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా వాణిజ్య విభాగ టీడీపీ అధ్యక్షుడు కుక్కడపు బాలాజీ, సీనియర్‌ నాయకులు తటవర్తి రాజా, వీవీజీ గుప్త, పెనుగొండ కామరాజు, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి మళ్ళ గణేష్‌ పాల్గొన్నారు.

ఏలేశ్వరం: పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద నిర్వహించిన వర్ధంతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు, సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహాలకు అలమండ దుర్గాప్రసాద్‌, న్యాయవాది చిట్టంశెట్టి పుల్లయ్య, తూమురౌతు గుర్రయ్య, వాగు బలరాం, సామంతుల రామన్న, ఊర రాజబాబు,కటకం కిరీటి, కందుల ప్రభాకరచౌదరి, వెలంపల్లి మురళి, యండగొండి నాగబాబు నివాళులర్పించారు.

సామర్లకోట: సామర్లకోట మండల పరిషత్‌ కార్యాలయం లో పొట్టిశ్రీరాములు చిత్రపటానికి ఎంఈవో వైవీ శివరామ కృష్ణయ్య, మండల పరిసత్‌ ఏవో సాయిబాబు తదితర కార్యా లయ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామర్లకోట మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిప ల్‌ మేనేజర్‌ అత్యుతరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.అరుణ, వైస్‌చైర్మన్‌ గోకిన సునేత్రా దేవి, కౌన్సిలర్లు స్వయంభారపు వీరభద్రరావు, యార్లగడ్డ జగదీష్‌, సేపేని సురేష్‌ కార్యాలయ సిబ్బంది పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జీజీహెచ్‌(కాకినాడ): అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతి ని పురస్కరించుకుని కాకినాడ జీజీహెచ్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీజీహె చ్‌ పరిపాలనా విభాగంవద్ద గురువారం సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు మరవేనివన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ఎంవో డాక్టర్‌ రాహుల్‌, నర్సింగ్‌ సిబ్బంది, మినిస్టీరియల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కరప: కరప ఎంపీడీవో కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో గుత్తుల భీమశంకరరావు, సీనియర్‌ అసిస్టెంట్‌ వీవీఎన్‌ వీరేష్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ టి.సురేష్‌, తదితరులు నివాళులర్పించారు.

Updated Date - 2022-12-16T00:29:38+05:30 IST