తపాలా ఉద్యోగుల ఆందోళన
ABN , First Publish Date - 2022-08-04T07:01:11+05:30 IST
తపాలా శాఖను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట బుధవారం తపాలా ఉద్యోగులు ఆందోళన చేశారు.
అమలాపురం టౌన్, ఆగస్టు 3: తపాలా శాఖను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట బుధవారం తపాలా ఉద్యోగులు ఆందోళన చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎఫ్‌ఎన్‌టీవో యూని యన్ కార్యదర్శి మాలే ఏకాంబరం, ఎన్‌ఎఫ్‌పీఈ కార్యదర్శి మధు, హెడ్ పోస్టుమాస్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడారు. పోస్టల్ ఉద్యోగులు పల్లవి, పద్మ, ప్రసాద్, పృథ్వి, మణిబాబు, సాయికృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.