పేద విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-12-31T01:16:48+05:30 IST

పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జగన్‌ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని పార్లమెంట్‌ సభ్యుడు మార్గాని భరత్‌ అ న్నారు.

పేద విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీలు భరత్‌, బోస్‌

ధవళేశ్వరం, డిసెంబరు 30: పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జగన్‌ ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని పార్లమెంట్‌ సభ్యుడు మార్గాని భరత్‌ అ న్నారు. శుక్రవారం స్ధానిక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగ ణంలో రూరల్‌ మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదు వుతున్న 1408 మంది విద్యార్థులకు బైజ్యూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేశారు. పార్టీ రూరల్‌ మండల కో ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కారర్యక్రమానికి ఎంపీ భరత్‌, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌లు ముఖ్య అతిఽథులుగా విచ్చేసి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎంపీడీవో రత్నకుమారి, ఎంఈవో తులసిరామ్‌, స్కూల్‌ హెచ్‌ఎం విజయదుర్గ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం

కడియం: విద్యాభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు అన్నారు. కడియం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు టి. సత్యనారాయణ అధ్యక్షతన ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శనివాడ లక్ష్మి, ఎంఈవో వి,లజపతిరాయ్‌, ఈలి గోపాలం, ఉప్పులూరి హనుమంతరావు, బూరుగుపల్లి సుబ్బారావు, కొత్తూరి బాలనాగేశ్వరరావు, శాకా పట్టాభి, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

సీతానగరం : మండల కేంద్రమైన సీతానగరం ప్రభుత్వ హైస్కూల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు వైసీపీ నాయకులు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. శుక్రవారం సీతానగరం ప్రభుత్వ హైస్కూల్లో ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం పీడి తమ్మారావు ఆధ్వర్యంలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో ఎంఈవో కె.స్వామినాయక్‌, ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, జెడ్పీటీసీ చలమళ్ళ వెంకటలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్‌ ఘంటా శ్రీనివాస్‌, కోండ్రపు ముత్యాలు తదితరులు పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లను పంపిణీ చేశారు.

Updated Date - 2022-12-31T01:16:48+05:30 IST

Read more