వరద బాఽధితులకు నష్టపరిహారం ఇస్తాం: సీఎం
ABN , First Publish Date - 2022-08-04T06:58:16+05:30 IST
యానాం నియోజకవర్గంలోని వరద బాధితుల కు నష్టపరిహారం అంద జేస్తామని సీఎం ఎన్.రంగసామి అన్నారు.
యానాం, ఆగస్టు 4: యానాం నియోజకవర్గంలోని వరద బాధితుల కు నష్టపరిహారం అంద జేస్తామని సీఎం ఎన్.రంగసామి అన్నారు. బుధ వారం పుదుచ్చేరి పర్యాటకశాఖ మంత్రి లక్ష్మీనారాయణ, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, కలెక్టర్, ఇతర కార్యదర్శులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంరతం సీఎం మీడియాతో మాట్లాడారు. యానాంలో ఇటీవల వచ్చిన వరదలపై మల్లాడి వినతిపత్రం ఇచ్చారన్నారు. తక్షణ పరిహారంగా ఎరుపు రంగా కార్డుకు రూ.5వేలు, ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలిన పసుపు రంగు కార్డులకు రూ.4500వేలు పరిహారం అందిస్తామన్నారు. పసుపు రంగు కార్డుకు ఇచ్చే 25కిలలో బియ్యానికి బదులు కిలో రూ.40చొప్పున రూ.వెయ్యి రెండు రోజుల్లో వారి ఖాతా ల్లో జమ చేస్తామన్నారు. ముగిపోయిన ఇళ్లు, తదితర సామగ్రికి సంబంధించి రెవెన్యూశాఖ నుంచి ఇచ్చే నివేదిక ఆధా రంగా నష్టపరిహారం ఇస్తామని సీఎం చెప్పారు. వరద పరి హారం ప్రకటించినందుకు సీఎం ఎన్.రంగసామి, గవర్నర్ తమిళసైకు యానాం ప్రజల తరుపున మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్‌లు కృతజ్ఞతలు తెలిపారు.