యానాదులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి

ABN , First Publish Date - 2022-12-07T01:14:13+05:30 IST

యానాదులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఏపీ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడమల రామచంద్రయ్య, ఛైర్మన్‌ బాపట్ల ప్రసాదరావు అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన సంఘం రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశానికి రామచంద్రయ్య అఽద్యక్షత వహించి మాట్లాడారు.

   యానాదులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 6: యానాదులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఏపీ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడమల రామచంద్రయ్య, ఛైర్మన్‌ బాపట్ల ప్రసాదరావు అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన సంఘం రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశానికి రామచంద్రయ్య అఽద్యక్షత వహించి మాట్లాడారు. చేపలు, ఎలుకలు పట్టుకుని, చిత్తుకాగితాలు ఏరుకుని జీవిస్తున్న తమను కాదని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెంది బీసీ-ఏలో ఉన్న బోయ, బెంతు, ఒరియా కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చుతూ తమను మాత్రం అన్యాయం చేశారని మండిపడ్డారు. రిటైర్డు ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఏకపక్ష కమిటీ నివేదికను తక్షణమే రద్దు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది యానాదులు అధికార వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అనంతరం సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురుని తొలగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో మర్రి సత్యనారాయణ, తలపల చంద్రమౌళి, బీఎల్‌ శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:14:15+05:30 IST