పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి పేరు పెట్టాలి

ABN , First Publish Date - 2022-07-05T07:10:01+05:30 IST

జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామరాజు పేరుపెట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సుందరబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి పేరు పెట్టాలి
కొవ్వూరు: అల్లూరి విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు

కొవ్వూరు, జూలై 4: జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామరాజు పేరుపెట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సుందరబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అల్లూరి జయంతి వేడుకలు సందర్భం గా కొవ్వూరు మెయిన్‌రోడ్‌లో పట్టణ కార్యదర్శి దగ్గు రాధాకృష్ణ అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు. పడాల గంగాధరరావు మాట్లాడుతూ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీప్రాంతంలో ఖనిజాల తవ్వకాల కోసం కార్పొరేట్‌ సంస్థలకు అటవీభూములను కట్టబెట్టి, అక్కడి నుంచి గిరిజనులను నెట్టివేయడానికి పూనుకున్నాయన్నారు. గిరిజనులకు భూమిపై హక్కు కల్పించే 170 చట్టాన్ని నీరుగారుస్తున్నారన్నారు. కార్యక్రమంలో మంచిలి వీరబాబు, కె.కనకారావు, ఎన్‌.హనుమంతు, శేషగిరి, అప్పలనాయుడు, వై.ఈశ్వరరావు, పి.జగన్నాధం తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ, గోదావరి మాత క్షత్రియ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిక్కి నాగేంద్ర అల్లూరి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ వారితో పోరాటం చేసి ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు అల్లూరి అని కొనియాడారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు చెరుకూరి సాయి రామకృష్ణరాజు, బీజేపీ పట్టణాధ్యక్షుడు బోడపాటి ముత్యాలరావు, కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ, కొండపల్లి రత్నసాయి, గోపిశెట్టి భువనేశ్వరి, పోణంగి పవన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T07:10:01+05:30 IST