అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-08-10T05:25:25+05:30 IST

పిఠాపురం, ఆగస్టు 9: ఐసీడీఎస్‌ పిఠాపురం ప్రాజెక్టు పరిధిలో 14 అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు సీహెచ్‌ఎస్‌కే దుర్గాదేవి తెలిపారు. పిఠాపురం మండలంలోని బి.కొత్తూరు-1, ఎల్‌ఎన్‌పురం-1, చిత్రాడ-1, విరవాడ-3, కొత్తపల్లి మండ

అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు దరఖాస్తులు

పిఠాపురం, ఆగస్టు 9: ఐసీడీఎస్‌ పిఠాపురం ప్రాజెక్టు పరిధిలో 14 అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసినట్టు సీహెచ్‌ఎస్‌కే దుర్గాదేవి తెలిపారు. పిఠాపురం మండలంలోని బి.కొత్తూరు-1, ఎల్‌ఎన్‌పురం-1, చిత్రాడ-1, విరవాడ-3, కొత్తపల్లి మండలంలో యండపల్లి-2, యండపల్లి తోటూరు, కుతుకుడుమిల్లి(పెదకలవలదొడ్డి), వాకతిప్ప-3, నాగులాపల్లి-2, ఉప్పాడ గాంధీనగర్‌, గొల్లప్రోలు మండలంలోని ఏ.విజయనగరం, దుర్గాడ-6 రామాలయం, చేబ్రోలు-6, గొల్లప్రోలు లో 1వ వార్డు ఎస్సీ కమ్యూనిటీహాలు ఏరియాకేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, జూలై 1వ నాటికి 21-35 ఏళ్ల మధ్య స్థానిక వివాహిత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. కార్యాలయంలో ఈనెల 10 నుంచి దరఖాస్తులు పొంది 23లోగా అందజేయాలని కోరారు. 

కరప: మండలంలో కూరాడ-1, కూరాడ-2, కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు, కరప-8, గొడ్డటిపాలెం-1, గొడ్డటిపాలెం-2, అడవిపూడి, పెనుగుదురు-4, కొంగోడు-1 కేంద్రాల్లో అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నామని ఽతాళ్ళరేవు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో వి.మాధవి తెలిపారు. 

ప్రత్తిపాడు: ధర్మవరం 13వ నెంబర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో హెల్పర్‌ పోస్టుకు నోటిఫికేషన్‌ జారీచేశారు. బీసీ-ఏకు చెందిన స్థానిక వివాహిత మహిళకు కేటాయిం చారు. దరఖాస్తులను పిఠాపురం ఐసీడీఎస్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు.

Updated Date - 2022-08-10T05:25:25+05:30 IST