టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , First Publish Date - 2022-03-05T06:03:53+05:30 IST
పిఠాపురం, మార్చి 4: పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎం. రామ్మోహన్ కోరారు. పట్టణంలోని పాతబస్టాండు వద్ద రాజీవ్‌గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించారు.
పిఠాపురం మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్
పిఠాపురం, మార్చి 4: పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎం. రామ్మోహన్ కోరారు. పట్టణంలోని పాతబస్టాండు వద్ద రాజీవ్‌గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రతిభ ఆధారంగా కేటగిరిలుగా విభజించాలన్నారు. విద్యార్థులు వెనుకబడినట్టు గుర్తించిన సబ్జెక్టులకు ప్రత్యేకంగా బోధోంచాలన్నారు. పదికి పది పాయింట్లు వచ్చే లా శ్రద్ధ వహించాలన్నారు. హెచ్‌ఎం రమేష్, సూపర్‌వైజరు ఆనందకుమార్, ఉపాధ్యాయులు హరి, జయలక్ష్మి, పద్మశ్రీ పాల్గొన్నారు.