స్టూడియోలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-12-07T01:48:12+05:30 IST

మండలంలోని ధర్మవరం మె యిన్‌రోడ్డులోని యూనియన్‌ బ్యాంక్‌ సమీపంలో ఉన్న ప్రైసీ డిజిటల్‌ స్టూడియో, జిరాక్స్‌ షాపులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.6లక్షల ఆస్తినష్టం జరిగింది.

స్టూడియోలో అగ్నిప్రమాదం

రూ.6లక్షల ఆస్తి నష్టం

ప్రత్తిపాడు, డిసెంబరు 6: మండలంలోని ధర్మవరం మె యిన్‌రోడ్డులోని యూనియన్‌ బ్యాంక్‌ సమీపంలో ఉన్న ప్రైసీ డిజిటల్‌ స్టూడియో, జిరాక్స్‌ షాపులో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.6లక్షల ఆస్తినష్టం జరిగింది. పాలిక ఆంజనేయస్వామికి చెందిన ఈ షాపులో మంగళవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో మంటలు వ్యాపించి విలువైన కెమెరాలు, జిరాక్స్‌ మిషన్‌లు, 3 కంప్యూటర్‌లు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. కరెంట్‌ షాక్‌ సర్క్యూట్‌ కారణంగా సంభవిం చింది. ఈ అగ్నిప్రమాదం విషయం తెలిసి ప్రత్తిపాడు అగ్నిమాపక ఇన్‌చార్జ్‌ ఎంజీ రత్నరాజు, కేఎ్‌సఎన్‌ మూర్తి, పి.రమేష్‌, ఎన్‌.సతీ్‌షలతో కూడి అగ్నిమాపక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పాలిక స్వామి మూడేళ్లుగా స్టూడియో, జిరాక్స్‌సెంటర్‌ నిర్వహిస్తూ ఉపాధి పొందుతుండగా అగ్నిప్రమాదంవల్ల సర్వం కోల్పోయాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-12-07T01:48:14+05:30 IST