పెరుగులంక భూముల పరిశీలన

ABN , First Publish Date - 2022-12-31T01:15:29+05:30 IST

మండలంలోని ర్యాలి ఎస్సీ సొసైటీకి సంబంధించిన పెరుగులంక భూములను కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి శుక్రవారం పరిశీలించారు.

పెరుగులంక భూముల పరిశీలన

ఆత్రేయపురం, డిసెంబరు 30: మండలంలోని ర్యాలి ఎస్సీ సొసైటీకి సంబంధించిన పెరుగులంక భూములను కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి శుక్రవారం పరిశీలించారు. 127 ఎకరాలకు ఏక్‌సాల్‌ లీజు పట్టా పొంది ఆరు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. సొసైటీ రైతులు రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆయన పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా పట్టాలకు నోచుకోని 8 ఎకరాల భూములకు సంబంధించి నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. పర్యటనలో ఆప్కాస్‌ డైరెక్టర్‌ కప్పల శ్రీధర్‌, తహశీల్దార్‌ అనిల్‌కుమార్‌, సొసైటీ ప్రెసిడెంట్‌ బులిచిన్ని, రాజేంద్రప్రసాద్‌, బంగారు శాస్త్రి, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:15:29+05:30 IST

Read more