పింఛన్లు ఎవరిని అడిగి తొలగిస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-30T00:57:58+05:30 IST

పింఛన్లు ఎవరిని అడిగి తొలగిస్తున్నారు. నోటీసులు ఎవరిని అడిగి ఇస్తున్నారు. మాకు చెప్పాల్సిన పని లేదా.. ఇక మేమెందుకు ఉన్నాం కౌన్సిల్‌ సభ్యులుగా అంటూ పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ అధికారులపై ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. స్థానిక మున్సిపల్‌ సమావేశపు మందిరంలో చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీమంగతాయారు అధ్యక్షతన గురువారం కౌన్సిల్‌ సాధారణ సమావేశం జరిగింది. కౌన్సిలర్లు అరెళ్ల వీర్రాఘవ

పింఛన్లు ఎవరిని అడిగి తొలగిస్తున్నారు

పెద్దాపురంలో కౌన్సిలర్ల ఆగ్రహం

పెద్దాపురం, డిసెంబరు 29: పింఛన్లు ఎవరిని అడిగి తొలగిస్తున్నారు. నోటీసులు ఎవరిని అడిగి ఇస్తున్నారు. మాకు చెప్పాల్సిన పని లేదా.. ఇక మేమెందుకు ఉన్నాం కౌన్సిల్‌ సభ్యులుగా అంటూ పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ అధికారులపై ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. స్థానిక మున్సిపల్‌ సమావేశపు మందిరంలో చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీమంగతాయారు అధ్యక్షతన గురువారం కౌన్సిల్‌ సాధారణ సమావేశం జరిగింది. కౌన్సిలర్లు అరెళ్ల వీర్రాఘవరావు, విజ్జపు రాజశేఖర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ కౌన్సిలర్లు అంటే లెక్క లేదా? పిం ఛన్లు మీఇష్టానుసారం తొలగిస్తున్నట్టు నోటీసులు జారీ చేసేస్తారా, ఎవరిని సంప్రదించి నోటీసులు జారీ చేశారు అని ప్రశ్నించారు. ప్రజలు, పింఛన్‌దారులు తమను నిందిస్తున్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సురేంద్ర స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాము నోటీసులు జారీ చేశామని చెప్పినా కౌన్సిలర్లు శాంతించలేదు. కౌన్సిలర్‌ త్సలికి సత్యభాస్కరరావు మాట్లాడుతూ పెద్దాపురం- జగ్గంపేట రహదారిలో ఉన్న శతాబ్ది పార్కు నిర్వహణ విషయం ఏంచేశారని, దీనిపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, మేనేజర్‌ జ్యోతీరాణీ, డీఈ ఆదినారాయణ, టీపీవో ఉమామహేశ్వరరావు, శానిటరీ ఇనస్పెక్టర్‌ దావీదురాజు తదితరులున్నారు.

Updated Date - 2022-12-30T00:57:58+05:30 IST

Read more