ప్రజలకు టీడీపీపై పెరిగిన నమ్మకం

ABN , First Publish Date - 2022-09-17T05:30:00+05:30 IST

పెద్దాపురం, సెప్టెంబరు 17: ప్రజలకు టీడీపీపై మరింత నమ్మకం పెరిగిందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని కాండ్రకోట గ్రామంలో ఆయన శనివారం పర్యటించారు. చినరాజప్పను టీడీపీ నాయకుడు ఎలిశెట్టి నాని అధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాజప్ప మాట్లాడు

ప్రజలకు టీడీపీపై పెరిగిన నమ్మకం
కాండ్రకోటలో ప్రజలతో మాట్లాడుతున్న రాజప్ప

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

పెద్దాపురం, సెప్టెంబరు 17: ప్రజలకు టీడీపీపై మరింత నమ్మకం పెరిగిందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని కాండ్రకోట గ్రామంలో ఆయన శనివారం పర్యటించారు. చినరాజప్పను టీడీపీ నాయకుడు ఎలిశెట్టి నాని అధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాజప్ప మాట్లాడుతూ టీడీపీలో శ్రమించే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని, కార్యకర్తలకు టీడీపీ మరింత నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. కార్యక్రమంలో మేడిద శ్రీనివాస్‌, గవరసాన శివరామకృష్ణ, ఎలిశెట్టి చక్రప్రకాష్‌, చాగంటి గోపాలకృష్ణ, తోట రామకృష్ణ పాల్గొన్నారు.

టీడీపీ నేతల అభినందన

సామర్లకోట, సెప్టెంబరు 17: టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను మండలంలోని వేట్లపాలెం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మిరామకృష్ణ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూలమాలలు వేసి అభినందించారు. మూడోసారి పెద్దాపురం నుంచి పోటీ చేసే టీడీపీ అభ్యర్థిగా రాజప్పను జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రకటించడంతో నాయకులు మాట్లాడుతూ పార్టీ ప్రాభల్యం ఏమాత్రం తగ్గలేదని, రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా చినరాజప్ప గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నున్న రామకృష్ణ, సంగమేశ్వరరావు, యరవటి శ్రీనివాస గంగారావు, వెంకన్న పాల్గొన్నారు. 

Read more