వైసీపీ పాలనలో సంక్షేమం శూన్యం

ABN , First Publish Date - 2022-12-31T00:25:28+05:30 IST

మూడేళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి అంతా శూన్యమ ని, పథకాల రద్దు, అమలుచేస్తున్న పథకాలకు కోత ఇలా అన్నివర్గాల ప్రజలు అయోమయంలో పడి ఇదేంఖర్మ మన రాష్ట్రానికి అంటూ ఆందోళన చెందుతున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని శుక్రవారం సామర్లకోట జగ్గమ్మ గారిపేట, మఠం సెంటర్‌, స్టేషన్‌ సెంటర్‌ ప్రాంతాల్లో టీడీపీ పట్టణ

వైసీపీ పాలనలో సంక్షేమం శూన్యం
మహిళతో మాట్లాడుతున్న చినరాజప్ప

సామర్లకోట, డిసెంబరు 30: మూడేళ్ల వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి అంతా శూన్యమ ని, పథకాల రద్దు, అమలుచేస్తున్న పథకాలకు కోత ఇలా అన్నివర్గాల ప్రజలు అయోమయంలో పడి ఇదేంఖర్మ మన రాష్ట్రానికి అంటూ ఆందోళన చెందుతున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని శుక్రవారం సామర్లకోట జగ్గమ్మ గారిపేట, మఠం సెంటర్‌, స్టేషన్‌ సెంటర్‌ ప్రాంతాల్లో టీడీపీ పట్టణ అధ్య క్ష, కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడు గు శ్రీకాంత్‌ ఆధర్యంలో నిర్వహించగా రాజప్పతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు కంటే జగదీ్‌షమోహన్‌, బలుసు శ్రీనివాస్‌, జయలక్ష్మి, గుమ్మళ్ళ రామకృష్ణ పాల్గొన్నా రు. సోమేశ్వరరావు, గుడాల శంకర్‌, పడాల వీరబాబు, గొలితి సత్యనారాయణ, కొత్తిం శ్రీనివాసరావు, వల్లూరి దొరబాబు పాల్గొన్నారు. ప్రభు త్వం రద్దుచేసిన ఫించన్లను యధావిథిగా కొనసాగించాలని లేకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ఉద్య మం కొనసాగిస్తామని రాజప్ప హెచ్చరించారు.

Updated Date - 2022-12-31T00:25:28+05:30 IST

Read more