విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

ABN , First Publish Date - 2022-12-16T23:56:30+05:30 IST

విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం పండుగ వాతావరణం దృష్ట్యా మండలంలో ఎక్కడా పేకాట, గుండాట, కోడిపందేలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ ఆదేశించారు. ఆయన గండేపల్లి

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

గండేపల్లి, డిసెంబరు 16: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం పండుగ వాతావరణం దృష్ట్యా మండలంలో ఎక్కడా పేకాట, గుండాట, కోడిపందేలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ ఆదేశించారు. ఆయన గండేపల్లి పోలీ్‌సస్టేషన్‌లో వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, క్రైంరేటు తగ్గేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా డేంజర్‌స్పాట్‌లో సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. పండుగ నెలరోజులు గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు, గొడవలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జగ్గంపేట సీఐ సూరి అప్పారావు, గండేపల్లి ఎస్‌ఐ గణే్‌షకుమార్‌, భాషా, సత్యనారాయణ, ఏఎ్‌సఐ శంకర్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:56:32+05:30 IST