పంచాయతీ వార్డు సభ్యుల రాజీనామాలు
ABN , First Publish Date - 2022-09-14T06:49:26+05:30 IST
చినకొత్తలంక గ్రామ పంచా యతీకి చెందిన ముగ్గురు వైసీపీ వార్డు సభ్యులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు.
ముమ్మిడివరం, సెప్టెంబరు 13: చినకొత్తలంక గ్రామ పంచా యతీకి చెందిన ముగ్గురు వైసీపీ వార్డు సభ్యులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. 2వవార్డు సభ్యుడు కమజు సూర్యవెంకటసత్యనారాయణ, 3వవార్డు సభ్యురాలు కముజు అనంతలక్ష్మిసత్యవతి, 10వవార్డు సభ్యురాలు పితాని భాగ్యలక్ష్మిలు రాజీనామాలు చేసి రాజీనామా పత్రాలను ఎంపీడీవో ఏఎన్ శ్రీని వాస్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తు న్నట్టు రాజీనామా పత్రాల్లో పేర్కొన్నారు. అయితే సర్పంచ్ పొత్తూరి ఉమారాణి భర్త పీటీవీ వర్మ వ్యవహారశైలికి నిరసన గానే వారు రాజీనామాలు చేసినట్టు సమాచారం.