ఘనంగా మట్టల ఆదివారం

ABN , First Publish Date - 2022-04-11T06:09:23+05:30 IST

క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థాన పండుగను(ఈస్టర్‌) పురస్కరించుకుని ఆయన అనుభవించిన శ్రమదినాలకు గుర్తుగా 40 రోజులపాటు క్రైస్తవులంతా ఉపవాసంలోను, దానధర్మంలోను పాల్గొన్నారు.

ఘనంగా మట్టల ఆదివారం

కొవ్వూరు, ఏప్రిల్‌ 10: క్రైస్తవులు మట్టల ఆదివారాన్ని ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు పునరుత్థాన పండుగను(ఈస్టర్‌) పురస్కరించుకుని ఆయన అనుభవించిన శ్రమదినాలకు గుర్తుగా 40 రోజులపాటు క్రైస్తవులంతా ఉపవాసంలోను, దానధర్మంలోను పాల్గొన్నారు. యేసుక్రీస్తు యెరుషలేములోకి ప్రవే శించిన రోజున మట్టలను అలంకరించి ఆయనకు స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలో మట్టల ఆదివారం నిర్వహించారు. ఉదయం కొవ్వూరులో ఈతమట్టలు చేతపట్టి హోసన్న గీతం పాడుతూ పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఉపవాసదీక్షలు ఆఖరి వారానికి చేరుకోవడంతో ఈ వారం రోజులపాటు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

Updated Date - 2022-04-11T06:09:23+05:30 IST