డిసెంబరు 31తో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తే ఎలా
ABN , First Publish Date - 2022-12-31T01:08:03+05:30 IST
ఖరీఫ్ ధాన్యం రైతుపై ప్రభుత్వం టైమ్ బాంబ్ ఫిక్స్ చేసింది. డిసెంబరు31వ తేదీతో ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొను గోళ్లు నిలిపివేస్తున్నట్టు రైతులకు సమా చారం పంపిస్తున్నారు.
కోరుకొండ, డిసెంబరు 30 : ఖరీఫ్ ధాన్యం రైతుపై ప్రభుత్వం టైమ్ బాంబ్ ఫిక్స్ చేసింది. డిసెంబరు31వ తేదీతో ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొను గోళ్లు నిలిపివేస్తున్నట్టు రైతులకు సమా చారం పంపిస్తున్నారు.దీనిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోరు కొండ మండలానికి సంబంధించి ఖరీఫ్ లో సుమారు 180 వేల ఎక రాల్లో వరి సాగు చేశారు.అధిక వర్షాల కారణంగా సాగు ఆలస్యమైంది. దీంతో 50 శాతం మాత్రమే పంట కోతకు వచ్చింది. మిగి లిన 50 శాతం పంటను రైతులు కోయించి కుప్పలు వేయించారు. ప్రస్తు తం ఆ ధాన్యం అంతా వరి కుప్పలపై ఉంది.డిసెంబరు31వ తేదీతో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపి వేస్తే వరి కుప్పలపై ఉన్న 50 శాతం ధాన్యాన్ని ఎవరు కొంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు.దీనికి ఆర్‌బీకేల నుంచి ఏ విధమైన హామీ లభించడం లేదు. రాజానగరం నియోజకవర్గం మెట్ట ప్రాం తం..ఖరీఫ్ మాత్రమే సాగు చేస్తారు.రబీకి అవ కాశం ఉండదు. కనీసం ఆ పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే మా పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు.ధాన్యం కొనుగో ళ్లు యధావిధిగా కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.
31తో నిలిపేస్తాం : మల్లికార్జునరావు,ఏడీఏ
డిసెంబరు 31వ తేదీతో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయాలని ఉన్నతా ధికారుల ద్వారా వచ్చిన ఆదేశాలను ఆర్‌బీకేల సిబ్బంది తెలియపరుస్తు న్నారు. కొనుగోళ్లు నిలిపివేయడం వాస్తవమే.. ఇది ప్రభుత్వ విధానం.. తాము చేయగలిగినది ఏమీ లేదని వివరణ ఇచ్చారు.