ఓటు హక్కును కలిగి ఉండాలి: సబ్ కలెక్టర్
ABN , First Publish Date - 2022-03-10T06:25:35+05:30 IST
18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండాలని సబ్ కలెక్టరు కట్టా సింహాచలం అన్నారు.
రంపచోడవరం, మార్చి 9: 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు కలిగి ఉండాలని సబ్ కలెక్టరు కట్టా సింహాచలం అన్నారు. బుధవారం ఆయన లెనోరా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటుహక్కు అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఓటరు అవగాహన పోటీల ఎన్నికల కమిషనర్ నియమ, నిబంధనలపై సూచన లు, సలహాలు వివరించారు. జాతీయ ఓటరు అవగా హనలో భాగంగా ఐదు రకాల క్విజ్ పోటీలు నిర్వహి ంచామన్నారు. పదినిమిషాల వ్యవధిలో పాటలు, వీడియో తయారీ, పోస్టర్ రూపకల్పన, నినాదం క్విజ్ పోటీలు తయారుచేసి ఈనెల 15లోగా ్ఛఛిజీటఠ్ఛి ్ఛఞ.ుఽజీఛి.జీుఽ/ఛిౌుఽ్ట్ఛట్ట/లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పోటీల్లో గెలుపొందిన వారికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లెనోరా ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టరు కె.జయరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రాజశరత్‌కుమార్, ఎన్నికల డిప్యూటీ తహశీల్దారు సత్యనారాయణ, లైబ్రేరియన్ ఎస్.దుర్గారావు పాల్గొన్నారు.