వంటనూనె కోసం ప్రత్యేక రిటైల్‌ కౌంటర్లు : జేసీ

ABN , First Publish Date - 2022-03-23T06:49:26+05:30 IST

హోల్‌సేల్‌ ధరలకే ప్రత్యేక రిటైల్‌ కౌంటర్ల ద్వారా వంట నూనెల అమ్మకాలు జరపాలని జేసీ సుమిత్‌కుమార్‌ వర్తకులకు సూచన చేశారు.

వంటనూనె కోసం ప్రత్యేక రిటైల్‌ కౌంటర్లు  : జేసీ

కాకినాడ సిటీ, మార్చి22: హోల్‌సేల్‌ ధరలకే ప్రత్యేక రిటైల్‌ కౌంటర్ల ద్వారా వంట నూనెల అమ్మకాలు జరపాలని జేసీ సుమిత్‌కుమార్‌ వర్తకులకు సూచన చేశారు. సరసమైన ధరలకు వంట నూనెలు ప్రజలకు లభించేలా ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వంట నూనెల ధరల్లో పెరుగుదల నేపథ్యంలో మంగళవారం రాత్రి కలెక్టర్‌ కార్యాలయంలో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ అధికారులు, హోల్‌సేల్‌ వర్తకులు తదితరులతో జాయింట్‌ కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మా ట్లాడుతూ వంట నూనెల అమ్మకాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పా టు చేయాలని కోరారు. దీంతో 8 మంది వంట నూనెల హోల్‌సేల్‌ వర్తకులు ప్రత్యేక కౌంటర్లు ద్వారా రిటైల్‌గా అమ్మకాలు జరిపేందుకు అంగీకరించారు. పామాయిల్‌ లీటర్‌ రూ.145, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.180, వేరుశెనగనూనె రూ173కు అమ్మ కాలు జరపాలని జేసీ సూచించారు. ఈ సమావేశంలో కాకినా డ హోల్‌సేల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గ్రంధి నారాయణరావు (బాబ్జి), డీఎస్‌వో పి ప్రసాదరావు పాల్గొన్నారు. 


Read more