హోరాహోరీగా జోనల్‌ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-12-13T01:04:08+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఆఫీసర్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో జోనల్‌ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను అమలాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి సోమవారం ప్రారంభించారు.

హోరాహోరీగా జోనల్‌ స్థాయి   బ్యాడ్మింటన్‌ పోటీలు

అమలాపురం టౌన్‌, డిసెంబరు 12: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఆఫీసర్స్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో జోనల్‌ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను అమలాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జగనన్న క్రీడా సంబ రాలు ప్రైజ్‌మనీ జోన్‌-2, జోనల్‌ స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనేందుకు 144 మంది క్రీడా కారులు హాజరయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు జిల్లాల నుంచి పురుషుల, మహిళల విభాగంలో జట్లు వచ్చాయి. పురుషుల సింగిల్స్‌లో 66 మంది, డబుల్స్‌లో 25 జట్లు, మహిళల సింగిల్స్‌లో 16 మంది, డబుల్స్‌లో ఆరు జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులను మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యాళ్ల నాగసతీష్‌, జడ్పీటీసీలు పందిరి శ్రీహరి, గెడ్డం సంపదరావు, కౌన్సిలర్లు చిత్రపు రామకృష్ణ, దొంగ నాగసుధారాణి, గోపి రాజి పరిచయం చేసుకు న్నారు. జిల్లా ప్రాధికార సంస్థ ముఖ్య క్రీడా శిక్షకుడు పీఎస్‌ సురేష్‌కుమార్‌, సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ రంకిరెడ్డి కాశీవిశ్వనాథం, చీఫ్‌ రిఫరర్‌ పాయసం శ్రీనివాస్‌ పర్యవేక్షణలో పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచే జట్లు ఈ నెల 20వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చీఫ్‌ కోచ్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. రౌండ్ల వారీగా పోటీలు సోమవారం రాత్రి హోరాహోరీగా కొనసాగాయి.

Updated Date - 2022-12-13T01:04:08+05:30 IST

Read more