నన్నయలో డిప్లమో ఇన్‌ కూచిపూడి డ్యాన్స్‌ కోర్సు

ABN , First Publish Date - 2022-12-31T01:19:04+05:30 IST

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో పార్ట్‌టైమ్‌ డిప్లమో ఇన్‌ కూచిపూడి డ్యాన్స్‌ కోర్సును ప్రారంభిస్తున్నామని వీసీ మొక్కా జగన్నాథరావు తెలిపారు.

 నన్నయలో డిప్లమో ఇన్‌ కూచిపూడి డ్యాన్స్‌ కోర్సు

దివాన్‌చెరువు, డిసెంబరు 30 : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో పార్ట్‌టైమ్‌ డిప్లమో ఇన్‌ కూచిపూడి డ్యాన్స్‌ కోర్సును ప్రారంభిస్తున్నామని వీసీ మొక్కా జగన్నాథరావు తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. వర్సిటీలోని ప్రదర్శన కళల విభాగం, నన్నయ భారతి, నన్నయ అధ్యాయన కేంద్రం ద్వారా ఈ కోర్సు ప్రారంభిస్తున్నా మ న్నారు. ఒక ఏడాది కాలపరిమితితో నడిపే ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్మీ డియట్‌ పూర్తిచేసిన మహిళలు అర్హులన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రర్‌ ఆచార్య అశోక్‌, ఓ.ఎస్‌.డి. ఆచార్య ఎస్‌.టేకి, ప్రిన్సిపాల్స్‌ కె.రమణేశ్వరి, వి.పెర్సిస్‌, డాన్స్‌ కోర్స్‌ కోఆర్డినేటర్‌ రాజరాజేశ్వరీదేవి, సహాయాచార్యులు తలారివాసు, నూక రత్నం, ఉదయభాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:19:06+05:30 IST