దళిత యువకుడి హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

ABN , First Publish Date - 2022-08-17T06:31:34+05:30 IST

దళిత యువకుడు కనికెళ్ళ శ్రీనివాస్‌ హత్యపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

దళిత యువకుడి హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

ద్రాక్షారామ, ఆగస్టు 16: దళిత యువకుడు కనికెళ్ళ శ్రీనివాస్‌ హత్యపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పీడీఎస్‌యూ అధ్యక్షుడు బి.సిద్దూ, ఏఐకేఎంఎస్‌ జిల్లా నాయకుడు జి.సూరిబాబు, అంబటి కృష్ణ మాట్లాడుతూ దొంగతనం పేరుతో శ్రీనివాస్‌పై  దాడిచేసి మరణానికి కారణమైన పాస్టర్‌ తనయుడు చినబాబుపై ఐపిసి 302 సెక్షన్‌, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని, శ్రీనివాస్‌ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని, కొడుకును చదివించాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ జీజీహెచ్‌లో మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. అక్కడ   బాధిత కుటుంబాలను నాయకులు కలిసి ఓదార్చారు.Read more