మురమళ్ల గ్రామసభ రసాభాస

ABN , First Publish Date - 2022-04-25T06:48:34+05:30 IST

మురమళ్ల సచివాలయం వద్ద సర్పంచ్‌ కాళే రాజబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన గ్రామసభ అరుపులు, కేకలతో రసాభాసగా మారింది.

మురమళ్ల గ్రామసభ రసాభాస

ఐ.పోలవరం, ఏప్రిల్‌ 24: మురమళ్ల సచివాలయం వద్ద సర్పంచ్‌ కాళే రాజబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన గ్రామసభ  అరుపులు, కేకలతో  రసాభాసగా మారింది. అధికార పార్టీకి చెందిన వార్డుమెంబర్లు, నాయకులు కొన్ని సమస్యలపై నిలదీయడంతో సభ గందరగోళంగా తయారైంది. గతపాలకవర్గంలో రూ.4లక్షల ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులతో నిర్మించిన షెడ్డును కూల్చివేయడంపై సర్పంచ్‌ కాళే రాజబాబును సభ్యులు నిలదీశారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పడంతో  కొంతమంది వార్డుమెంబర్లు, గ్రామస్తులు  తీవ్రంగా ఖండించారు. జలజీవన్‌మిషన్‌  ద్వారా గ్రామంలో  పైపులైన్లు అస్తవ్యస్తంగా ఏర్పాటుచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి గంజా సుధాకర్‌, నియోజకవర్గ టీడీపీ ఎస్సీసెల్‌ కన్వీనర్‌, మాజీసర్పంచ్‌ చెయ్యేటి శ్రీనుబాబు, వార్డు సభ్యులు ఆరోపించారు. 



Updated Date - 2022-04-25T06:48:34+05:30 IST