నేడు ముమ్మిడివరంలో బాలయోగి తీర్థం
ABN , First Publish Date - 2022-03-02T06:14:01+05:30 IST
ముమ్మిడివరంలో బుధవారం జరిగే శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తీర్థ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి మరుసటి రోజు ముమ్మిడివరంలో తీర్థం నిర్వహించడం ఆనవాయితీ.
ముమ్మిడివరం,
మార్చి 1: ముమ్మిడివరంలో బుధవారం జరిగే శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తీర్థ
మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి మరుసటి రోజు
ముమ్మిడివరంలో తీర్థం నిర్వహించడం ఆనవాయితీ. బాలయోగీశ్వరుల తీర్ధాన్ని
పురస్కరించుకుని ఆశ్రమకమిటీ, కుటుంబసభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సమాధుల దర్శన
కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో
ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.