తల్లితో పాలతో బిడ్డకు రక్షణ

ABN , First Publish Date - 2022-08-04T06:12:31+05:30 IST

బిడ్డ ఎదుగుదలకు తల్లి పాలు మాత్రమే రక్షణ అని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ బేబిరాణి అన్నారు.

తల్లితో పాలతో బిడ్డకు రక్షణ

బొమ్మూరు, ఆగస్టు 3: బిడ్డ ఎదుగుదలకు తల్లి పాలు మాత్రమే రక్షణ అని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ బేబిరాణి అన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా బుధవారం బొమ్మూరు పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన పిల్లలుగా ఎదగాలంటే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. పాలు పట్టడం వల్ల తల్లికి రొమ్ము కాన్యర్‌ వంటి భయంకరమైన రోగాలు దరిచేరవని తెలిపారు. కార్యక్రమంలో తల్లులు, బాలింతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T06:12:31+05:30 IST