ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
ABN , First Publish Date - 2022-06-07T01:07:56+05:30 IST
ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు
తూర్పుగోదావరి: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగించారు. మరో 14 రోజులు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు పొడిగించింది. పోలీసులు మెమో ఎక్స్‌టెన్షన్‌తో ఈనెల 20వరకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 1న అనంతబాబు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రేపు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. కాగా, తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మే నెల 19వ తేదీ రాత్రి కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యం (24) హత్య జరిగింది.