ద్వారంపూడికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-07-18T06:52:06+05:30 IST

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి కొవిడ్‌ బారిన పడ్డారు. కొన్నిరోజు లుగా ఆయన ఇంటివద్దే ఉండి చికిత్స పొందుతున్నారు.

ద్వారంపూడికి కరోనా పాజిటివ్‌

కాకినాడ, జూలై 17: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి కొవిడ్‌ బారిన పడ్డారు. కొన్నిరోజు లుగా ఆయన ఇంటివద్దే ఉండి చికిత్స పొందుతున్నారు. ఇటీవల జరిగిన వైసీపీ ప్లీనరీలోను, కాకినాడ జిల్లా సమీ క్షలోను పాల్గొని తిరిగి వచ్చిన ఆయన కరోనా పరీక్ష చే యించుకోగా పాజిటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ నేతలు తెలిపారు.

Read more