గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-03-04T06:16:55+05:30 IST

మండలంలో గోదావరిలో బుధవారం గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది.

గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

సీతానగరం, మార్చి 3: మండలంలో గోదావరిలో బుధవారం గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. దేవీపట్నం మండలం నేలకోటకు చెందిన వల్ల శ్రీనివాసరెడ్డి(32) పురుషోత్తపట్నం తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకంలో పైప్‌లైన్‌ వర్కర్‌గా పనిచేసేవాడు. ఈ నెల ఒకటిన మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి స్నేహితులతో కలిసి పట్టిసీమ వీరభద్రుని దర్శనానికి బయలుదేరాడు. పురుషోత్తపట్నం-రామచంద్రపురం మధ్య అనధికార రేవు నుంచి గోదావరిలోకి దిగి ఈదుతూ వెళుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రెండో రోజైన గురువారం రెవెన్యూ, పోలీస్‌ శాఖల ఆధ్వర్యంలో గోదావరిలో పడవలపై గాలించగా పురుషోత్తపట్నం-రామచంద్రపురం మధ్య గోదావరిలో శ్రీనివాసరెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌ఐ శుభశేఖర్‌ తరలించారు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా శ్రీనివాసరెడ్డికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు.

Read more