పంచాయతీ సమావేశాలకు మొక్కుబడి పిలుపు

ABN , First Publish Date - 2022-08-10T06:26:00+05:30 IST

ప్రొటోకాల్‌ పాటించడం లేదని, గ్రామ పంచా యతీ సమావేశాలకు హాజరులో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలు వురు ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

పంచాయతీ సమావేశాలకు మొక్కుబడి పిలుపు

ఉండ్రాజరవం, ఆగస్టు 9: ప్రొటోకాల్‌ పాటించడం లేదని, గ్రామ పంచా యతీ సమావేశాలకు హాజరులో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలు వురు ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామా ల్లో జరిగే కార్యక్రమాలకు తమను మొక్కుబడిగా పిలుస్తున్నారని ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యాక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించడంలేదని చివటం టీడీపీ ఎంపీటీసీ సత్యనారాయణ, కె.సా వరం జనసేన ఎంపీటీసీ కరుణాకర్‌ ఆరోపించారు. గంట ముందు మొక్కుబడి సమాచారం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కోఆప్షన్‌ సభ్యుడునైన తనకు ఏ కార్యక్ర మంలోనూ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాలకు సైతం తనకు ఆహ్వానం అందడం లేదని పసలపూడి గ్రామానికి చెందిన షేక్‌ షాజహాన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఇకపై ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రమణ చెప్పారు. సచివాలయం ఖర్చులు పంచాయతీలకు అదనపు భారంగా ఉన్నాయని తాడిపర్రు సర్పంచ్‌ కరుటూరి నరేంద్ర పేర్కొన్నారు. ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి మాట్లాడుతూ ఉండ్రాజవరంలో కొత్తగా మంజూరైన జూనియర్‌ కాలేజీలో విద్యార్థులు చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రజలు, అధికారులు, నాయకులు సమష్టి కృషి చేయాలని ఆమె సూచించారు. వివిధ శాఖల అధికారులు తమ నివేదికలు సమావేశంలో తెలియజేసారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సరోజ, ఈవోపీఆర్డీ ఎం.వీరాస్వామినాయుడు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T06:26:00+05:30 IST