‘చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’
ABN , First Publish Date - 2022-03-05T06:05:47+05:30 IST
భానుగుడి (కాకినాడ), మార్చి 4: వీఆర్ఏల ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి పిలుపునిచ్చారు. వీఆర్ఏల సమస్యలపై రెండురోజులు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు శుక్రవా
భానుగుడి (కాకినాడ), మార్చి 4: వీఆర్ఏల ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి పిలుపునిచ్చారు. వీఆర్ఏల సమస్యలపై రెండురోజులు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. బేబిరాణి దీక్షలు ప్రారంభించగా వీఆర్ఏల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారపురెడ్డి వీరభద్రం, పలివెల సత్యనారాయణ, కర్రి త్రినాథ్, మోకా సత్యనారాయణ పాల్గొన్నారు. పాదయాత్ర సమయంలో సీఎం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలుచేసి ఆదుకోవాలని కోరారు.