1న దసరా మహిళా సాధికారత ఉత్సవం

ABN , First Publish Date - 2022-09-19T06:17:34+05:30 IST

రాజమహేంద్రవరంలో దసరా మహిళా సాధికారత ఉత్సవం తొలిసారి నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు.

1న దసరా మహిళా సాధికారత ఉత్సవం
మహిళా సాధికారత ఉత్సవ పోస్టర్‌ విడుదల చేస్తున్న వాసిరెడ్డి పద్మ తదితరులు

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 18 : రాజమహేంద్రవరంలో దసరా మహిళా సాధికారత ఉత్సవం తొలిసారి నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యమైదానంలో ఆదివారం సభా వేదికను పరిశీలించారు. మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యంత వేడుకగా మహిళా సాధికారత దినోత్సవ నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల ఒకటవ తేదీన నగరంలో మూడు వేల మంది మహిళలతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. మహిళా సాధికారిత ఉత్సవంలో  సబల  రాష్ట్రస్థాయి లఘు చిత్రాల ప్రదర్శనతో పాటు సీనీ కళారంగ ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేస్తారన్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునేవారు ఈ నెల 25వ తేదీలోపు ఏపీడబ్ల్యుసీ షార్ట్‌ ఫిల్మ్‌ 2022 ఎట్‌దిరేట్‌ఆఫ్‌ జీమెయిల్‌.కామ్‌కి మెయిల్‌ పంపించవచ్చన్నారు. 93812 43599, 94413 56482 నెంబర్లకు ఫోన్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని చెప్పారు. లోన్‌ యాప్‌ ద్వారా తక్కువ మొత్తం రుణాలు ఇచ్చి లక్షల్లో దోచుకుని వేధింపులకు గురిచేస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్‌పర్స్‌న్‌ మేడపాటి షర్మిళారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ,రాష్ట్ర ఖాదీ ఇండస్ట్రీస్‌ బోర్డు చైర్మన్‌ పిల్లి నిర్మల, నిరీక్షణ, డాక్టర్‌ పద్మకమలాకర్‌,టికే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more