‘మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం’
ABN , First Publish Date - 2022-08-07T07:04:45+05:30 IST
స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి జిల్లాలో మాదిగ అనుబంధ కులాలకు రాజకీ యంగా తీరని అన్యాయం జరుగుతోందని డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా మాదిగల పొలిటికల్ జేఏసీ ఆరోపిం చింది.
అమలాపురం టౌన్, ఆగస్టు 6: స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి జిల్లాలో మాదిగ అనుబంధ కులాలకు రాజకీ యంగా తీరని అన్యాయం జరుగుతోందని డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా మాదిగల పొలిటికల్ జేఏసీ ఆరోపిం చింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మాదిగ, అనుబంధ కులాల అభ్యర్థులకు ఓసీ, బీసీ, ముస్లిం మైనారిటీలు మద్దతు ప్రకటించడంపై సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. నడిపూ డిలోని డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్ కమ్యూనిటీ హాలులో జేఏసీ కన్వీనర్ చెయ్యేటి శ్రీను అధ్యక్షతన శనివారం సమా వేశం నిర్వహించారు. జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వు అయినప్పటికీ ఒకే సామాజికవర్గం నేటి వరకు ఆ పదవులను అనుభవిస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు యార్లగడ్డ రవీంద్ర, తొత్తరమూడి నరసింహారావు, తొత్తరమూడి ఉమామ హశ్వరరావు, నేదునూరి నతానియేలు, వీధి లోవరాజు, కొడమంచిలి కృష్ణ, కన్నెపాముల వెంకటేశ్వరరావు, నేదునూరి రాజ్‌కుమార్, ఆకుమర్తి సత్యనారాయణ పాల్గొన్నారు.