-
-
Home » Andhra Pradesh » East Godavari » madiga ineer caste winning-NGTS-AndhraPradesh
-
మాదిగ ఉపకులాల అభ్యర్థులను గెలిపించుకోవాలి
ABN , First Publish Date - 2022-08-17T06:22:57+05:30 IST
ఓట్ ఫర్ కోనసీమ 2024లో భాగంగా కోనసీమ జిల్లాలోని రిజర్వుడ్ స్థానాల నుంచి మాదిగ, అనుబంధ కులాల అభ్యర్థులను పోటీలో నిలిపి గెలిపించుకోవాలని ఓసీ, బీసీ, మైనార్టీల సంఘ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఓసీ, బీసీ, మైనార్టీల సంఘ సమావేశం తీర్మానం
అమలాపురం రూరల్, ఆగస్టు 16: ఓట్ ఫర్ కోనసీమ 2024లో భాగంగా కోనసీమ జిల్లాలోని రిజర్వుడ్ స్థానాల నుంచి మాదిగ, అనుబంధ కులాల అభ్యర్థులను పోటీలో నిలిపి గెలిపించుకోవాలని ఓసీ, బీసీ, మైనార్టీల సంఘ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. మంగళవారం జనుపల్లిలోని జనుపల్లమ్మ ఆలయం వద్ద ఐక్య ప్రతినిధుల సమావేశం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు, కాపు జేఏసీ నాయకుడు కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు సామాజికవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లాలోని ఎంపీ స్థానంతో పాటు ఎస్సీలకు రిజర్వుడ్ చేసిన మూడు అసెంబ్లీ స్థానాల్లో మాదిగ, అనుబంధ కులాల ప్రతినిధులను పోటీలో నిలిపి గెలిపించుకునేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు. గుత్తుల శ్రీను, మాజీ సర్పంచ్ వాకపల్లి శ్రీనివాస్, కొలిశెట్టి దుర్గా రావు, కుడుపూడి దమనేశ్వరరావు, వాకపల్లి వెంకన్నా యుడు, సంసాని నటరాజు, మామిడిశెట్టి చరణ్, పోలిశెట్టి రామచంద్రరావు, గుత్తుల శివ, వీరా శ్రీను, గొవ్వాల రమణ, పోలిశెట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.