లారీ ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-04T05:49:47+05:30 IST

పెళ్లి నిశ్చయిమై త్వరలోనే పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో అసువులు బాసాడు. కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామానికి చెందిన బల్ల కిశోర్‌కుమార్‌(22) గొల్లప్రోలు మండలంలోని ఒక పరిశ్రమలో పనిచేస్తున్నాడు.

లారీ ఢీకొని యువకుడి మృతి

పిఠాపురం, ఆగస్టు 3: పెళ్లి నిశ్చయిమై త్వరలోనే పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో అసువులు బాసాడు.  కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామానికి చెందిన బల్ల కిశోర్‌కుమార్‌(22) గొల్లప్రోలు మండలంలోని ఒక పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా పిఠాపురం పట్టణ శివారు డ్రైవర్స్‌ కాలనీ సమీపంలో నవఖండ్రవాడ మలుపు వద్ద కిశోర్‌కుమార్‌ మోటార్‌సైకిల్‌ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కిశోర్‌కుమార్‌ అక్కడికక్కడే మరణించాడు. సంఘటనా స్థలం వద్ద ప్రైవేటు లేఅవుట్‌ వేస్తున్న నిర్వాహకులు భూమిని ఎత్తు చేసేందుకు గ్రావెల్‌ను వినియోగిస్తున్నారని, అది రోడ్డుపై పడి వర్షానికి జారుడుగా మారిందని కిశోర్‌ బంధువులు ఆరోపించారు. గ్రావెల్‌పై మోటార్‌సైకిల్‌ జారి కిందపడిపోగా లారీ మీద నుంచి వెళ్లిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కిశోర్‌కుమార్‌ బంధువులు, స్నేహితులు  ఆందోళనకు దిగారు. సుమారు ఐదు గంటల పాటు ఆందోళన కొనసాగింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. కిశోర్‌కు కొద్ది రోజుల క్రితమే పిఠాపురం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చమయింది. త్వరలోనే పెళ్లి చేద్దామనుకున్న తరుణంలో ఇలా చనిపోవడంతో బంధువులు విలపిస్తున్నారు.

Updated Date - 2022-08-04T05:49:47+05:30 IST