జాతీయ లోక్‌అదాలత్‌లో 1004 కేసులకు విముక్తి

ABN , First Publish Date - 2022-08-14T07:46:21+05:30 IST

అమలాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రికార్డు స్థాయిలో రూ.1.14 కోట్ల విలువైన 1,004 కేసులు పరిష్కారమయ్యాయి.

జాతీయ లోక్‌అదాలత్‌లో 1004 కేసులకు విముక్తి
కేసులను పరిష్కరిస్తున్న అదనపు జిల్లా జడ్జి నరేష్‌

రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం

అమలాపురం టౌన్‌, ఆగస్టు 13: అమలాపురం కోర్టు  ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో రికార్డు స్థాయిలో రూ.1.14 కోట్ల విలువైన 1,004 కేసులు పరిష్కారమయ్యాయి. అమలాపురం రెండో అదనపు జిల్లా జడ్జి, మండల్‌ లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ వి.నరేష్‌ ఆధ్వర్యంలో ఈ నేషనల్‌ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. 959 క్రిమినల్‌ కేసులు, 24 ఎక్సైజ్‌ కేసులు, 12 సివిల్‌ దావాలు, 9 యాక్సిడెంట్‌ కేసులు ఒకేరోజు పరిష్కారమయ్యాయి. సీనియర్‌ సివిల్‌ జడ్జి కే శైలజ, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి వై.శ్రీలక్ష్మి, లోక్‌అదాలత్‌ సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు.Updated Date - 2022-08-14T07:46:21+05:30 IST