లోకేశ్‌ యువగళం అశేష ఆంధ్రుల జనగళం కావాలి

ABN , First Publish Date - 2022-12-31T01:13:19+05:30 IST

నారా లోకేశ్‌ చేపడు తున్న ‘యువ గళం’ ఆశేష ఆంధ్రుల జనగళం కావాలని, అరాచక వైసీపీని భూస్థాపితం చేసే వరకు ఒక్కో కార్య కర్త ఒక్కో సైనికుడిలా పనిచేయాలని టీడీపీ రామచంద్ర పురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మ ణ్యం పిలుపునిచ్చారు.

లోకేశ్‌ యువగళం అశేష ఆంధ్రుల జనగళం కావాలి

రామచంద్రపురం, డిసెంబరు 30: నారా లోకేశ్‌ చేపడు తున్న ‘యువ గళం’ ఆశేష ఆంధ్రుల జనగళం కావాలని, అరాచక వైసీపీని భూస్థాపితం చేసే వరకు ఒక్కో కార్య కర్త ఒక్కో సైనికుడిలా పనిచేయాలని టీడీపీ రామచంద్ర పురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మ ణ్యం పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. తోపుడు బండ్ల వ్యాపారులు, చిరువ్యాపారస్తులు ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ అంటూ వ్యాపారాలు కొనసా గిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్‌, కార్యదర్శి నండూరి ఫణికుమార్‌, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కల రిష్వంత్‌ రాయ్‌, నియోజకవర్గ అధ్యక్షుడు చింతపల్లి ఆర్జున్‌, మున్సి పల్‌ మాజీ చైర్మన్‌ మేడిశెట్టి సూర్యనారాయణ, టీడీపీ నాయకులు గరికపాటి సూర్యనారాయణ, వీర్రాజు, మహి ళా నాయకురాళ్లు జాస్తి విజయలక్ష్మి, సూదంశెట్టి వనిత, ఎం.సత్యవతి, బళ్ల లక్ష్మి, ఈదల దొరబాబు, కొసనా శ్రీను, రెడ్డి నాగేంద్ర, మేడిశెట్టి రవి, జాస్తి చక్రవర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:13:20+05:30 IST