బాప్‌రే.. యాప్‌!

ABN , First Publish Date - 2022-09-13T06:46:54+05:30 IST

రుణయాప్‌ల మాయాజాలంలో పడి పేదలు, నిరుద్యోగ యువత బలైపోతున్నారు.

బాప్‌రే.. యాప్‌!

సెల్‌లో ఒక్క క్లిక్‌ చేశామా చిక్కినట్టే

రుణాలకు ఆశపడితే అంతే

జిల్లాలో ఇప్పటికే రెండు దా‘రుణాలు’

ఏడుగురు యువకుల అరెస్టు


(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

రుణయాప్‌ల మాయాజాలంలో పడి పేదలు, నిరుద్యోగ యువత బలైపోతున్నారు.ఈ యాప్‌లన్నీ ప్లే స్టోరుకు అనుసంధానం చేసినవి. ఇన్‌స్టాల్‌ చేయగానే సంబంధించిన పూర్తి డేటా వాళ్లకు చేరిపోతుంది.ఒక్క క్లిక్‌తో రుణం వస్తుంది కదా అని యాప్‌ ను ఇన్‌స్టాల్‌ చేస్తే చాలు  నిర్వాహకులు మొత్తం  డేటాను లాగేసి తర్వాత బ్లాక్‌ మెయిల్‌తో వేధింపులకు గురి చేస్తున్నారు. తీసుకున్న డబ్బు వాయిదాల ప్రకారం కట్టకపోయినా.. పైగా వాళ్లు వడ్డిం చే వడ్డీతో సహా చెల్లించకపోయినా వేధింపులు ఆరంభమవుతాయి.ఆ వేధింపులను తట్టుకోవడం చాలా కష్టం. వేధింపులు ఎంతలా ఉంటాయంటే.. చచ్చిపోవడమే నయం అన్నంతగా.. కేవలం రూ.6 వేల రుణం తీసు కుని గత జూన్‌లో  కడియం గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా.. ఫోటోలు మార్పిడి చేసి, సోషల్‌ మీడియాలో పెడతామంటూ బ్లాక్‌మెయిల్‌ చేసిన హ్యాండీలోన్‌, స్పెడ్‌లోన్‌  నిర్వాహకుల వేధింపులు తాళలేక ఈ నెల 7వ తేదీన రూ. 50వేల రుణం తీసుకున్న దంపతులు కొల్లి దుర్గా రావు,లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ దంపతులకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రుణ యాప్‌ నిర్వాహకులు వేఽధింపుల ముందు కన్న ప్రేమ కూడా నిలబ డలేక పోయింది.ఈ మేరకు యాప్‌ నిర్వాహకులపై రాజమహేంద్రవరం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో  పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దంపతుల బలవన్మరణానికి కారకులైన హ్యాండీలోన్‌, స్పెడ్‌ లోన్‌ యాప్‌లకు చెందిన ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్టు తూర్పుగోదావరి జిల్లా అడిషనల్‌ చార్జి ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. స్థానిక దిశ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం రాత్రి అడిషనల్‌ ఎస్పీ రజనీతో కలిసి వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటకు చెందిన లంబాడీ నరేష్‌ (23),మియాపూర్‌ మదీనాగూడలోని ద్వారకానగర్‌ కాలనీకి చెందిన కొల్లూరి శ్రీనివాసయాదవ్‌ (27), బేగంపేట బ్రాహ్మణ వీధికి చెందిన  మేడిశెట్టి పృఽథ్వీరాజ్‌(22), కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం మండలం శ్రీవిద్యా స్కూల్‌ సమీపంలోని ఉంటున్న నక్కా సుమంత్‌(23), జడ్డంగి అన్నవరం గ్రామానికి చెందిన మండా వీరవెంకట హరిబాబు(23),అనకాపల్లి జిల్లా సిరిసాపల్లికి చెందిన దానబోయిన భాస్కర్‌(23), విశాఖ జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన కోరుపోలు రామకృష్ణ) 24) ఉన్నారు. వీరంతా ఈ యాప్‌లలో ఉద్యోగాలు చేస్తున్నారు.అసలు యాప్‌లు ఏర్పాటు చేసిన వారు ఇతర రాష్ర్టాలకు చెందినవారు కావడం గమనార్హం. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు. రుణయాప్‌ నిర్వాహకులు లోకల్‌గా పనిచేసే వారికి ఉద్యో గం ఇచ్చి కమీషన్‌ ఇస్తుంటారు. కమీషన్‌కు కక్కు ర్తిపడి అనేకమంది యువత ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. కేవలం ఫోన్‌ ద్వారా వ్యవహారం నడిపించవచ్చుకదా అనే ఆలోచనతో  చేరు తున్నారు. దంప తుల ఆత్మహత్య కేసులో ఇలా పనిచేసే ఏడుగురు యువకులు అరెస్టయ్యారు. అసలు యాప్‌ నిర్వాహకులు ఇంకా దొరకలేదు. వారు వేరే రాష్ర్టాలకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. వారి కోసం వేట మొదలైంది. ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి పట్టుకునే పనిలో పడ్డారు.   


Read more