శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు : ఏఎస్పీ లతామాధురి

ABN , First Publish Date - 2022-08-14T07:48:06+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమలో జిల్లాలో ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె.లతామాధురి హెచ్చరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు : ఏఎస్పీ లతామాధురి
అంబాజీపేటలో సర్కిల్‌ కార్యాలయం ప్రారంభిస్తున్న ఏఎస్పీ

అంబాజీపేట, ఆగస్టు 13 : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమలో జిల్లాలో ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అడిషనల్‌ ఎస్పీ కె.లతామాధురి హెచ్చరించారు. జిల్లాల పునర్విజనలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన సర్కిల్‌ కార్యాలయాన్ని అంబాజీపేటలో ప్రారంభించారు. సర్కిల్‌ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా డి.ప్రశాంత్‌కుమార్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ లతామాధురి మాట్లాడుతూ సర్కిల్‌ పరిధిలో అం బాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, నగరం పోలీస్‌స్టేషన్‌లు ఉంటా యన్నారు. సోషల్‌ మీడియోలో రెచ్చగొట్టేవిధంగా పోస్టింగ్‌లు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లా ప్రశాంతంగా ఉండేందుకు ప్రజలు సహకరించాలన్నారు. తొలుత ఏఎస్పీ పోలీసులు ఘనస్వాగతం పలికారు. డీఎస్పీ వై.మాధవరెడ్డి, ఎస్‌ఐలు ఎ.చైతన్యకుమార్‌, షేక్‌ జానీబాషా, పి.నాగేశ్వరరావు, సత్యభుజంగరావులు పాల్గొన్నారు.Updated Date - 2022-08-14T07:48:06+05:30 IST