సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరాల నివారణ

ABN , First Publish Date - 2022-08-17T05:56:59+05:30 IST

కాకినాడ క్రైం, ఆగస్టు 16: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా సైబర్‌ నేరాలను నివారించవచ్చని, సీసీటీఎన్‌ఎస్‌ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఐటీ కోర్‌ విభాగం ఆధ్వర్యంలో ఐదురోజులపాటు జరిగే క్రైం క్రిమినల్‌ నెట్వర్కింగ్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఎస్పీ ప్రారంభించారు. ఆయ

సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరాల నివారణ
అవగాహన కల్పిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు

కాకినాడ క్రైం, ఆగస్టు 16: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా సైబర్‌ నేరాలను నివారించవచ్చని, సీసీటీఎన్‌ఎస్‌ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఐటీ కోర్‌ విభాగం ఆధ్వర్యంలో ఐదురోజులపాటు జరిగే క్రైం క్రిమినల్‌ నెట్వర్కింగ్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ట్రాకింగ్‌ సిస్టమ్‌తో ప్రతీక్షణం నేరస్తుల డేటా అప్‌లోడ్‌ చేయడంతో దేశంలో ఉన్న నేర సమాచారాన్ని సమీకృతం చేసి నివారించవచ్చన్నారు. సెవెన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫార్మ్‌, పిటిషన్‌ మేనేజిమెంట్‌, ఎఫ్‌ఐఆర్‌ రిజిస్ట్రేషన్‌, కేసు ఇన్వెస్టిగేషన్‌, ముద్దాయి అరెస్ట్‌, చార్జ్‌షీట్‌, హిస్టరీ షీట్లు, ఐసీజెఎస్‌, ఐరాడ్‌, సీఐఎస్‌, సైబర్‌ మిత్ర, సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ తదితర ఆన్‌లైన్‌ అప్లికేషన్ల పనితీరుపై పీపీటీ సాయంతో శిక్షణ ఇచ్చారు. తొలిరోజు శిక్షణకు 111మంది హాజరయ్యారు. మూడు బ్యాచ్‌లుగా 5 రోజులపాటు ఈనెల 20 వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. 

ప్రజలకు అవగాహన కల్పించాలి

సైబర్‌ నేరాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మంగళవారం ఎస్‌డీపీవోలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో సైబర్‌ నేరాలు, కేసుల దర్యాప్తుపై జూమ్‌ వీడి యో కాన్షరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సైబర్‌ క్రెమ్‌ హెల్ప్‌లైన్‌ నెం బర్‌ 1930కు ఫోన్‌ చేస్తే లభించి సహాయంపై అవగాహన కల్పించాలన్నారు. ఏఎస్పీ పి.శ్రీనివాస్‌, ఐటీకోర్‌ సీఐ, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-08-17T05:56:59+05:30 IST