ఉత్సాహంగా శాప్‌ అథ్లెటిక్స్‌ లీగ్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-02-17T05:07:22+05:30 IST

కాకినాడ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 16: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి శాప్‌ అథ్లెటిక్స్‌ పోటీలు బుధవారం క్రీడా మైదానంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను డీఎ్‌సఏ సీఈవో భానుప్రకాష్‌, జిల్లా అథ్లెటిక్స్‌ సంఽఘ అధ్యక్షుడు డాక్టర్‌ కె.స్పర్జన్‌

ఉత్సాహంగా శాప్‌ అథ్లెటిక్స్‌ లీగ్‌ పోటీలు
లాంగ్‌ జంప్‌ విభాగంలో పోటీ పడుతున్న క్రీడాకారిణి

కాకినాడ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 16: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి శాప్‌ అథ్లెటిక్స్‌ పోటీలు బుధవారం క్రీడా మైదానంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను డీఎ్‌సఏ సీఈవో  భానుప్రకాష్‌, జిల్లా అథ్లెటిక్స్‌ సంఽఘ అధ్యక్షుడు డాక్టర్‌ కె.స్పర్జన్‌రాజు ప్రారంభించారు. అండర్‌-14 బాలురు, బాలికలకు 60 మీటర్లు, 200 మీటర్లు, 600 మీటర్లు, 1000 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌, క్రికెట్‌ బాల్‌ త్రో పోటీలు నిర్వహించారు. విజేతలకు చీఫ్‌ కోచ్‌ సురే్‌షకమార్‌ మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్‌ సంఘ కార్యదర్శి రంగారావు, బంగార్రాజు, డీఎ్‌సఏ అథ్లెటిక్స్‌ కోచ్‌ ప్రసాద్‌రెడ్డి, పీఈటీలు నూకరాజు, బీవీజీటీ రాజు, భాను, దుర్గ, కోచ్‌ శేషగిరి పాల్గొన్నారు.

Read more