ఆస్తిపన్ను బకాయిలపై అధికారుల డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-03-05T06:04:46+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 4: నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను బకాయిలపై యంత్రాంగం కొరడా ఝళిపించింది. అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, డిప్యూటీ కమిషనర్‌ సీహెచ్‌ సత్యనారాయణరావు ఆఽధ్వర్యంలో కళాశాలలు, దుకాణాలు సీజ్‌ చేశారు. మెయి

ఆస్తిపన్ను బకాయిలపై అధికారుల డ్రైవ్‌

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 4: నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను బకాయిలపై యంత్రాంగం కొరడా ఝళిపించింది. అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, డిప్యూటీ కమిషనర్‌ సీహెచ్‌ సత్యనారాయణరావు ఆఽధ్వర్యంలో కళాశాలలు, దుకాణాలు సీజ్‌ చేశారు. మెయిన్‌రోడ్‌, భానుగుడి, నాగమల్లితోట, గాంధీనగర్‌ ప్రాంతాల్లో అధికారులు బకాయిలపై డ్రైవ్‌ నిర్వహించారు. ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం రూ.కోటి 50లక్షలు బకాయి ఉం డడంతో కళాశాలను సీజ్‌ చేశారు. దీంతో యాజమాన్యం రూ.3.50 లక్షలు చెల్లించి మార్చి 12వరకు గడువు కోరారు. ఓ బ్యాంకు, ఓ హోటల్‌, ఓ గెస్ట్‌ హౌస్‌ అధిక మొత్తంలో బకాయిలు ఉండటంతో వాటికి నోటీసులిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో షాపులు సీజ్‌ చేయగా, మరికొన్ని ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్‌లు కట్‌ చేశారు. 

Updated Date - 2022-03-05T06:04:46+05:30 IST