కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం ద్వారా రుణాలు

ABN , First Publish Date - 2022-04-24T06:05:31+05:30 IST

భానుగుడి (కాకినాడ), ఏప్రిల్‌ 23: పంట సాగు చేసే ప్రతి రైతుకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం ద్వారా రుణాలు, సంబంధిత ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జేసీ ఇలాక్కియా తెలిపారు. కిసాన్‌ క్రెడిట్‌కార్డులు-రుణాలపై శనివారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత ప్రభుత్వ

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం ద్వారా రుణాలు

భానుగుడి (కాకినాడ), ఏప్రిల్‌ 23: పంట సాగు చేసే ప్రతి రైతుకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం ద్వారా రుణాలు, సంబంధిత ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జేసీ ఇలాక్కియా తెలిపారు. కిసాన్‌ క్రెడిట్‌కార్డులు-రుణాలపై శనివారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఉత్తర్వుల మేరకు నాబార్డు, లీడ్‌బ్యాంకు, వ్యవసాయశాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ ఇతర అనుబంధశాఖల ఆధ్వర్యంలో ఈనెల 24 నుంచి మే 1 వరకూ కిసాన్‌ భాగిధారి ప్రత్మిక్తా హమారీ పథకం కింద కేసీసీ రుణాల మంజూరుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిసు ్తన్నట్టు తెలిపారు. ఆర్‌బీకే-గ్రామ సచివాలయ పరిధిలో గ్రామసభలు ఏర్పాటు చేసి అర్హత ఉండి ఇప్పటివరకూ ఎలాంటి రుణాలు పొందని వ్యవసాయ, పాడి, మత్స్య రైతులు దరఖాస్తు చేసుకునే అవగాహన కల్పించాలని జేసీ సూచించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజరు ఎస్‌.శ్రీనివాసరావు, నాబార్డు డీడీ ఎం డాక్టర్‌ వైఎస్‌ నాయుడు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు బీరమణ,జెసీతారామరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T06:05:31+05:30 IST