జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తనిఖీ

ABN , First Publish Date - 2022-08-17T05:55:45+05:30 IST

కాకినాడ క్రైం, ఆగస్టు 16: జిల్లా పోలీసు కార్యాలయంలోని పలు విభాగాలను మంగళవారం ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు తనిఖీలు చేశారు. ఈ

జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తనిఖీ

కాకినాడ క్రైం, ఆగస్టు 16: జిల్లా పోలీసు కార్యాలయంలోని పలు విభాగాలను మంగళవారం ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కార్యాలయంలోని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రక్రియ పూర్తయిన రికార్డులను నిర్దేశించిన స్టోర్‌రూమ్‌ల్లో భద్రపరచాలని సూచించారు. కొన్ని విభాగాల్లోని కార్యాలయ గదుల నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

Read more