కాపులను నట్టేట ముంచిన జగన్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-11-03T01:04:04+05:30 IST

జగన్‌ ప్రభుత్వం కాపు సామాజికవర్గానికి తీరని ద్రోహం చేసిందని టీడీపీకి చెందిన కాపు సామాజికవర్గం ధ్వజమెత్తింది.

కాపులను నట్టేట ముంచిన జగన్‌ ప్రభుత్వం

ఉప్పలగుప్తం, నవంబరు 2: జగన్‌ ప్రభుత్వం కాపు సామాజికవర్గానికి తీరని ద్రోహం చేసిందని టీడీపీకి చెందిన కాపు సామాజికవర్గం ధ్వజమెత్తింది. బీసీ జాబితాలో కాపులను చేర్చడం కుదరదని తెగేసి చెప్పిన జగన్‌ ఇప్పుడు కాపులకు పెద్దపీట వేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించింది. టీడీపీ మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ అధ్యక్షతన బుధవారం భీమనపల్లిలో కాపుల సమావేశం జరిగింది. ముఖ్య నాయకులు మాట్లాడుతూ కాపుల పట్ల జగన్‌ ప్రభు త్వ తీరును ఎండగట్టారు. టీడీపీ హయాంలోనే కాపులకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యం లభించిందన్నారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా ఎంతో మంది కాపు యువతకు టీడీపీ ఉపాధి కల్పిస్తే దానిని వైసీపీ రద్దుచేసి కాపు యువతకు ద్రోహం చేసిందన్నారు. కాపులు నిజాలు గ్రహించారని తెలుసుకున్న జగన్‌ సరికొత్త స్ర్కిప్టుతో తెర ముందుకు వచ్చారని ఆరోపించారు. అందులో భాగంగానే స్వప్రయోజనాల కోసం వైసీపీలో చేరిన కొందరు కాపు ప్రజాప్రతినిధులు కిరాయి జనంతో సమావేశాలు పెట్టి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాపుల అభివృద్ధి టీడీపీతో మాత్రమే సాధ్యమన్న నిజాన్ని ఇప్పటికైనా గ్రహించి వైసీపీ పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, ఆకేటి బాబులు, అడ బాల సత్యనారాయణ, చిక్కం పెదబాబు, మద్దింశెట్టి సురేష్‌, మంచెం బుజ్జి, గొలకోటి చిన్నా, పెమ్మిరెడ్డి సురేష్‌, ఆకేటి పెద్ద, చిక్కం ఉమేష్‌, ఆకుల వెంకటరమణ, నాగిరెడ్డి సత్తిబాబు,యాళ్ళ సత్తిబాబు, మంచెం బాబి మాట్లాడారు.

కాపుల కోసం ఏంచేసిందో చెప్పాలి..?

మామిడికుదురు, నవంబరు 2: జనసేన పార్టీ అధ్య క్షుడు పవన్‌కల్యాణ్‌ను విమర్శించే ముందు రాష్ట్ర ప్రభు త్వం కాపుల కోసం ఏం చేసిందో చెప్పాలని జనసేన పార్టీ నాయకుడు, సర్పంచ్‌ల సమాఖ్య మండల అధ్యక్షుడు అడ బాల తాతకాపు, మండలశాఖ అధ్యక్షుడు జాలెం శ్రీనివాస రాజా ప్రశ్నించారు. బుధవారం మామిడికుదురు గ్రామ శాఖ అధ్యక్షుడు యింటి మహేంద్ర ఇంటి వద్ద జరిగిన జనసేన నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని కులాలవారు జనసేన వైపు చూస్తున్నా రని, అది తట్టుకోలేని ప్రభుత్వం జనసేన మీద కాపు కులముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్ర మంలో నాయకులు పోతు కాశి, కంకిపాటి నరసింహారావు, ఈలి రాంబాబు, మద్దింశెట్టి బుజ్జి, బత్తుల శేఖర్‌, కాట్రేనిపాడు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T01:04:07+05:30 IST