పాస్‌బుక్‌ సేవను ఉపయోగించుకోవాలి: జేసీ

ABN , First Publish Date - 2022-08-05T05:22:27+05:30 IST

కాకినాడ సిటీ, ఆగస్టు 4: మ్యూటేషన్‌ సేవను ప్రస్తుతం ఏపీ సేవ పోర్టల్‌లో సులభతరం చేసేందుకు 3సేవలు కలిపి మ్యూటేషన్‌, టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదారు పాస్‌బుక్‌ అని ఒకే సేవగా అందిస్తున్నామని జేసీ ఇలాక్కియా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త సేవలో ఉపవర్గాల సవరణ,

పాస్‌బుక్‌ సేవను ఉపయోగించుకోవాలి: జేసీ

కాకినాడ సిటీ, ఆగస్టు 4: మ్యూటేషన్‌ సేవను ప్రస్తుతం ఏపీ సేవ పోర్టల్‌లో సులభతరం చేసేందుకు 3సేవలు కలిపి మ్యూటేషన్‌, టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదారు పాస్‌బుక్‌ అని ఒకే సేవగా అందిస్తున్నామని జేసీ ఇలాక్కియా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త సేవలో ఉపవర్గాల సవరణ, లావాదేవీలు, సవరణల తో లావాదేవీల కోసం మ్యూటేషన్‌లు వేర్వేరుగా ఉంటాయన్నారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన మ్యూటేషన్‌, టైటిల్‌ డీడ్‌ కమ్‌ పట్టాదారు పాస్‌బుక్‌ సేవను అందరూ గమనించి ఉపయోగించుకోవాలన్నారు. వివరాలకు సమీపంలోని సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని జేసీ తెలిపారు.

Updated Date - 2022-08-05T05:22:27+05:30 IST