త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి: ఎంపీ గీత
ABN , First Publish Date - 2022-06-08T06:20:24+05:30 IST
కాకినాడ రూరల్, జూన్ 7: లబ్ధిదారులంతా త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కాకినాడ ఎంపీ వంగాగీత అన్నారు. రూరల్ మండలం ఇంద్రపాలెం పిల్లిఅనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కల్యాణమండపంలో మం గళవారం ఇంద్రపాలెం, గంగనాపల్లి, కొవ్వాడ గ్రామాల్లోని లబ్ధిదారులకు ఇ
ఇంద్రపాలెంలో పట్టాలందజేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
కాకినాడ రూరల్, జూన్ 7: లబ్ధిదారులంతా త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కాకినాడ ఎంపీ వంగాగీత అన్నారు. రూరల్ మండలం ఇంద్రపాలెం పిల్లిఅనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కల్యాణమండపంలో మం గళవారం ఇంద్రపాలెం, గంగనాపల్లి, కొవ్వాడ గ్రామాల్లోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ నేమాంలో ఇళ్ల స్థలాలను కేటాయించామన్నా రు. 3 గ్రామాల్లో 1435మంది లబ్ధిదారులకు పట్టాలను అందజేస్తున్నామన్నారు. వలసపాకలలో ఎంపీ, ఎమ్మెల్యే 816మందికి పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ మురార్జీ, ఎంపీడీవో నారాయణమూర్తి, పంచాయతీ కార్యదర్శులు బి.సత్యనారాయణ, గోవిందరాజులు, శివప్రసాద్, ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబాబ్జీ, రూరల్ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను తదితరులున్నారు.